తైవాన్ లో శనివారం అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(డీపీపీ), కౌమిన్ టాంగ్ పార్టీ(కేటీపీ), తైవాన్ పీపుల్స్ పార్టీ(టీపీపీ) మూడు ప్రధాన పార్టీలు బరిలో అధికార పీఠం కోసం చూస్తున్నాయి.
దాదాపు కోటి 95 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఈ ఎన్నికలు తైవాన్ భవిష్యత్తో పాటు చైనాతో సంబంధాలపై కూడా ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.