ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వలెనే నిర్మాణ వ్యయం పెరిగింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 09:20 PM

ఏపీ ప్రభుత్వ అలసత్వం వల్లే రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్  తెలిపారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ మధ్య పార్లమెంట్‌లో కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ప్రకటించిన విధంగా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం 42% పైగా పెరిగింది. ఏపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో దాదాపు ౩౦ ప్రాజెక్టుల వ్యయం.. 58 వేల కోట్ల రూపాయిల మేరకు అదనపు భారం కేంద్రం పైన పడిందన్నారు. ముదరవలస వద్ద రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం రైల్వే శాఖకు బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని మండిపడ్డారు. జోనల్ ప్రధాన కార్యాలయానికి అవసరమైన కొత్త భవనాల నిర్మాణం, శాశ్వత భవనాల నిర్మాణం కోసం 52.20 ఎకరాల రెవెన్యూ భూమి అవసరమని చెప్పారు. ఈ భూమిని బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల పనులు ఆగిపోయాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 31 కొత్త రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. ఇందులో 5,581 కిలోమీటర్లు 70,000 కోట్ల విలువైన 16 కొత్త లైన్లు మరియు 15 డబ్లింగ్ లైన్ల పనులు ఉన్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వం సకాలంలో భూసేకరణ చేసి ఇవ్వడంలో విఫలమవ్వడంతో జాతీయ రహదారుల నిర్మాణ సమయం పెరిగి.. ప్రాజెక్టుల వ్యయం భారీగా పెరిగి పోతుందన్నారు. కేంద్రం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 25 లక్షల గృహాలను.. జగనన్న కాలనీలుగా పేరు మార్చి ప్రజలకు ఇస్తున్నారని లంకా దినకర్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa