చంద్రబాబుకు కుప్పానికి ఏమైనా సంబంధం ఉందా అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం ఎందుకు వెళ్లాడు. లోకేష్ మంగళగిరిలో పుట్టాడా, పెరిగాడా? అని ప్రశ్నించారు. బాలకృష్ణ హిందూపురం ఎందుకు వెళ్లాడని ఆయన నిలదీశారు. ఎస్సీల సీట్లను చంద్రబాబు మార్చలేదా? అని ప్రశ్నించారు. పీతల సుజాత, అనిత, జవహర్ సీట్లు ఎందుకు మార్చాడని మండిపడ్డారు. చంద్రబాబుకి దళితులంటే తీవ్రమైన వివక్ష అంటూ ధ్వజమెత్తారు. దళితుల సీట్లు మారుస్తున్నారని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని నారాయణస్వామి కొనియాడారు.