భారత్-మాల్దీవుల వివాదం నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన అనంతరం ఆయన మాట్లాడారు. మమ్మల్ని వేధించే హక్కు ఏ దేశానికి లేదని అన్నారు.
‘మేము చిన్న వారమే కావచ్చు, కానీ అది మమ్మల్ని బెదిరించే లైసెన్సు మీకు ఇవ్వదు’ అని పరోక్షంగా ఇండియాను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీపై అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.