భోగి పండుగ సందర్భంగా ఆదివారం రాయచోటి పట్టణంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయం, సాయి బాబా మందిరం తదితర ప్రాంతాల్లో భోగి మంటలు వేశారు. పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి రమేశకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంకాంత్రి లక్ష్మికి స్వాగతం పలకడంతో పాటు రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన భోగి మంటల్లో పడి కాలి బూడిద కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన పోయినప్పుడే తెలుగు ప్రజలకు నిజమైన సంక్రాంతి పండుగ అన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లెల్లో భోగి పండుగ మంటలతో సంక్రాంతి సందడి మొదలైంది. భద్రకాళీ సమేత వీరభద్ర ఆలయంలో అర్చకులు వీరభ ద్రుడు, భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రమేశకుమార్‌రెడ్డి జిల్లా పరిషత మాజీ చైర్మన సుగవాసి బాలసుబ్ర మణ్యం, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్‌బాబు, నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాఽథరెడ్డి, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్య క్షుడు చమర్తి జగనమోమోహనరాజు రాయచోటి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.