విజయవాడ పరిధిలోని మండలంలోని కొత్తూరు తాడేపల్లి గ్రామంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ రఘరాం అనుచరుల హస్తం ఉంది. మట్టి తవ్వకాలు చేస్తూ వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తు తున్నారు. ప్రభుత్వ సంపద విచ్చలవిడిగా దోచుకుతిం టున్నారు. గ్రామంలో అనధికార మైనింగ్‌ను నిలుపుదల చేసే వరకు దీక్షా శిబిరం కొనసాగుతుంది’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. కొత్తూరు తాడే పల్లిలో అక్రమ మైనింగ్ నిలిపివేయాలని మూడు రోజులుగా గ్రామ రైతులు నిరసన తెలుపుతున్నారు. దీక్షా శిబిరానికి ఆది వారం ఉమా వచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని అధికారులకు ఎన్ని ఫిర్యా దులు చేసినా చర్యలు శూన్యమన్నారు. హైకోర్టు, గ్రీన్ ట్రైబ్యు నల్ కోర్టులు మైనింగ్ ఆపాలని ఆదేశాలు ఇచ్చినా అధికార పార్టీ నేతలు బేఖాతరు చేస్తున్నారన్నారు. మైనింగ్‌ను అడ్డుకు నేందుకు వచ్చిన సబ్ కలెక్టర్ వెళ్లకుండా రోడ్లు తవ్వేశార న్నారు. సబ్ కలెక్టర్‌కే దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మాఫియాకు మైనింగ్, పోలీసు, ఫారె స్ట్, రెవెన్యూ అధికారులు అండగా నిలవడం సిగ్గుచేటన్నారు.