మంగళగిరి శ్రీ లక్ష్మీ నారాయణస్వామి వారి దేవస్థానం ఆవరణలో సోమవారం శ్రీ రాధాకృష్ణా యోగ సేవా కేంద్రం నూతన సంవత్సర యోగ క్యాలెండర్ ను తహశీల్దార్ జీవీ రామ్ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కంప్యూటర్ యుగంలో యోగ సాధన ద్వారా మనిషి ఒత్తిడిని జయించవచ్చన్నారు. కార్యక్రమంలో యోగ సాధకులు డొగిపర్తి శ్రీహరిరావు, కదం రాంబాబు, నారాయణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.