ఖలిస్థాన్ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈసారి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను చంపేస్తామని హెచ్చరించాడు.
గ్యాంగ్‌స్టర్‌లు అంతా ఏకమై రిపబ్లిక్ డే రోజున పంజాబ్ సీఎంను చంపేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చాడు. పన్నూన్ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.