ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం కనీస వేతనాలు పెంచాల్సిందేనంటూ చిలమత్తూరు మండల అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం చేపట్టిన సమ్మెలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు సమ్మె చేపట్టి 36 రోజులు కావడంతో సమ్మె దినాల సంఖ్యగా కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల వాగ్ధానంగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిలబెట్టుకోవాలన్నారు.