ఆంధ్రప్రదేశకు ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం హిందూపురం పట్టణంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఎఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు విభజన సమయంలో ఇచ్చిన హామీలు, కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటుపై మాటతప్పిన ప్రధాని మోదీ ఏ రకంగా రాష్ట్రంలో పర్యటిస్తారో చెప్పాలన్నారు.