గత 75సంవత్సరాల్లో సహకార ఉద్యమం ఆశించిన స్థాయిలో పురోగమించలేదని కేంద్రమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి 5ట్రిలియన్ డాలర్లుగా భారత్ ఎకానమీ ఆవిర్భవిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, ఈ లక్ష్య సాధనలో సహకారరంగం భారీ వాటాను కలిగి ఉండేలా చూడడమే తమ లక్ష్యమన్నారు. సహకార ఉద్యమం అభివృద్ధి కోసం ప్రభుత్వం గత 30నెలల్లో 60పెద్ద కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు.