విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కాంస్య విగ్రహం తయారీకి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం, 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ వినియోగించారు. స్మృతివనం ప్రహరీ చుట్టూ 2,200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయిని ఉపయోగించారు. పాలరాతిని అక్కడక్కడ వాడారు. స్మృతివనం చుట్టూ గ్రీనరీతోపాటు వాటర్ ఫౌంటెయిన్లు, ఎలివేషన్ డిజైన్లు ఉన్నాయి.