ఈ నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి.
తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతీకరమైన లడ్డూలను అయోధ్య రామయ్య సన్నిధికి టీటీడీ అధికారులు తరలిస్తున్నారు. శనివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్యకు లక్ష లడ్డూలను టీటీడీ అధికారులు పంపారు.