చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
స్టేజ్‌పై నడుస్తూ కాలు స్లిప్ అయి పడిపోబోయిన స్టాలిన్‌కు మోదీ సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.