హిందూపురం పట్టణంలో పట్టు రైతులు, రీలర్ల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె శనివారంకు నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టు రీలర్ల సంఘం నాయకులు, పట్టు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండి ఇప్పటివరకు రైతులకు ఇన్సెంటివ్ దాదాపు 50 కోట్లు, రీలర్లకు 10 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలి అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ వినతిపత్రం అందజేశారు.