ఈ నెల 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో జై శ్రీరామ్ నినాదాలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. వేడుక కోసం ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కెనాడాలోని మూడు మునిసిపాలిటీలు జనవరి 22వ తేదీని రామ మందిర్ డే గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. బ్రాంప్టన్, ఓక్ విల్లే, బ్రాంట్‌ఫోర్డ్ మునిసిపాలిటీలు ఆరోజును రామ మందిర్ డేగా అధికారికంగా ప్రకటించాయి.