ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక-5 పంపిణీకి జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ద్విభాషా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్బుక్లు, యూనిఫాం, బెల్ట్, బూట్లు, డిక్షనరీ, బ్యాగ్లు వంటి వాటిని 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు ఉచితంగా అందించేందుకు వీలుగా రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతులను విద్యాశాఖ మంజూరు చేసింది.