లోన్ యాప్ వేధింపులకు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరగటిచెర్లలో యువకుడు బలి అయ్యాడు. డబ్బుల అవసరమై బీటెక్ చదువుతున్న విద్యార్థి విగ్నేశ్ లోన్ యాప్ ద్వారా కొంత డబ్బు తీసుకున్నారు.
ఈ నెల లోను డబ్బులు చెల్లించాలని ఏజెంట్లు డిమాండ్ చేశారు. తన పరిస్థితిని ఏజెంట్లకు విగ్నేశ్ చెప్పే ప్రయత్నం చేశారు. మరింతగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ వేధింపులు తాళలేక విగ్నేశ్ బలవన్మరణానికి పాల్పడ్డారు.