ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పచ్చపత్రికలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు (పచ్చ పత్రికలు) గౌరవం లేదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని అందరూ అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని అన్నారు. పచ్చ మీడియాను..పత్రికలను బహిష్కరించాలన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు ఎల్లో మీడియాకు మనసు రాలేదా? అని మండిపడ్డారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు. అంబేద్కర్‌ను పచ్చమీడియా అవమానించిందని..అంబేద్కర్‌కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.