నెల్లూరు జిల్లా, వెంకటగిరిలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ‘రా.. కదలి రా’ ప్రోగ్రాం అట్టర్ ప్లాఫ్ అని.. దాంట్లో కొత్తదనం కనిపించలేదని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు.. డబ్బులిచ్చి మరీ జనాలను తరలించారని మండిపడ్డారు. శనివారం నెల్లూరులో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. చప్పట్లు కాదు.. చంద్రబాబును చెప్పులతో కొట్టాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకి దమ్ము, దైర్యం, నీతి నిజాయితీ ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు.