ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఈనెల 23 వ తేదీ మంగళవారం ఉరవకొండకు రానున్నారు. ‘వైయస్ఆ ర్ ఆసరా’ పథకం కింద డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి నాలుగో విడత సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు సంబంధించిన వేదిక ఇతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గౌతమి, ఎస్పీ అన్బురాజన్, ఉరవకొండ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి, సీఎం కో- ఆర్డినేటర్ తలసిల రఘురాం, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ వై. ప్రణయ్ రెడ్డి, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. భారత్ పెట్రోల్ బంకు సమీపంలో సభాస్థలిని, జూనియర్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్‌ను ఎంపిక చేశారు. సెక్యూరిటీ జోన్‌పరంగా చూసుకుంటే ఇక్కడే అన్ని విధాలా బాగుందని అధికారులు నివేదించారు.