అనంతపురం,ఎన్టీఆర్ మార్గ్‌లోని ఓ టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో ఇదే టైర్ల షాపులో అగ్ని ప్రమాదం జరిగి ఒక మహిళ మరణించారు. ఆ ఘటన మరువకముందే ఈ ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తీవిస్తుంది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఎవరైనా గిట్టనివారు చేశారా? లేక షాపు యజమానా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.