టీడీపీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి గెలుపునకు ముఖ్యమని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కోరారు. శ ఇంటింటికి తిరగి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిం చాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల ముసుగులో ఓట్లను తొలగించే ప్రక్రియకు కంకణం కట్టుకొందన్నారు. టీడీపీ నాయకులు ఓటర్ల జాబితాపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే మహిళలకు గౌరవం, యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. అన్నదాతల సాదకబాదలను తెలిసిన చంద్రబాబునాయుడు వ్యవసాయదారులు ఇబ్బందులకు గురికాకుండా ఏటా వారిఖాతాల్లో రూ.20 వేల నగదు జమ చేయనున్నట్లు ప్రజలకు తెలపాలన్నారు. చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే వెలుగొం డ ప్రాజెక్ట్‌తోపాటు, మార్కాపురం జిల్లాను కూడా సాధించుకోవచ్చన్నారు.