శనివారం నాడు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని సత్యకుమార్ అంటున్నారు. అందుకోసమే తుగ్లక్ చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. దక్షిణాదిలో బీజేపీ బలపడుతుందని సత్యకుమార్ ధీమాతో ఉన్నారు. తమ పార్టీకి లోక్ సభ సీట్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠలో ప్రతి హిందువు భాగస్వామ్యం అయ్యారని సత్యకుమార్ వివరించారు. మరికొన్ని గంటల్లో రామజన్మభూమిలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అయోధ్యపురి ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది అని తెలిపారు.