చిత్తూరు నియోజకవర్గంలో సుమారు 13,600 ఓట్లు చేర్చారని, 15వేలకుపైగా ఓట్లు తీసివేశారని, షిఫ్టింగ్ ఓట్లు 15వేల వరకు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. అయన మాట్లాడుతూ.. 22వ తేదీన ఓటర్ల జాబితా వస్తుందని.. దాని ఆధారంగా దొంగ ఓట్లను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓ ఎర్రచందనం స్మగ్లర్‌కు వైసీపీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లకంతా కింగ్ పిన్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అని ఆరోపించారు.