ఈనెల 24వ తేదీన సీఎం జగన్ తిరుపతి రానున్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి అందిన సమాచారం మేరకు ఈనెల 23, 24 తేదీల్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరిట జాతీయ స్థాయి విద్యా సమ్మేళనం తిరుపతిలో జరగనుంది. పలు రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు పాల్గొంటారని సమాచారం. నగరంలోని హోటల్ తాజ్‌లో జరిగే ఈ రెండు రోజుల కార్యక్రమానికి సంబంధించి 24వ తేదీన సీఎం జగన్ హాజరవుతారు. దీనికోసం 22న విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తిరుపతి వస్తున్నారు. ఆయన వచ్చాకే సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమాలు ఖరారవుతాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. సీఎంవో నుంచీ వచ్చిన సమాచారంతో శనివారం సాయంత్రం కలెక్టర్ వెంకట్రమణారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం హోటల్ తాజ్‌కు కూడా వెళ్ళి ప్రాధమికంగా ఏర్పాట్ల గురించి పరిశీలించారు.