రాజధాని అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్ బాబు (50) గుండెపోటుతో శనివారం మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో రెండు రోజుల క్రితం తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం గుండెపోటు రావడంతో మృతి చెందారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ కోసం మార్టిన్ తన అసైన్డ్ భూమి ఎకరం 50 సెంట్లు ఇచ్చారు. దళిత జేఏసీని స్థాపించి అమరావతి ఉద్యమంలో దళితులు ముందుండేలా చేశారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహం మందడంలో జరుగుతాయని బంధువులు తెలిపారు. మార్టిన్ మృతిపట్ల రైతు, మహిళా, దళిత జేఏసీలు నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.