ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారానికి వచ్చి ఉచిత హామీలు గుప్పిస్తారని ఎమ్మెల్సీ ఇషాక్ అహ్మద్ విమర్శించారు. మహిళలకు కిలో బంగారం, ఇంటికో కారు కూడా ఇస్తామని హామీ ఇస్తారని..అటువంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్న దూరదృష్టి గల వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం డోన్ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు.