ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో ట్రాక్ నిర్వహణ పనులు,,,,పలు రైళ్లు, మరికొన్ని దారి మళ్లించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 08:24 PM

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో ట్రాక్‌ కారిడార్‌ పనులు నిర్వహి స్తున్న దృష్ట్యా.. ఈ నెల 29– ఫిబ్రవరి 25 వరకు గుంటూరు–విశాఖ (17239/17240), కాకినాడ పోర్టు–విశాఖ (172­67­/­17268), మచిలీపట్నం–విశాఖ (17219/17220), గుంటూరు–రాయగఢ్‌ (17243/ 17244), బిట్రగుంట–విజయవాడ (07977/ 07978) రైళ్లు రద్దయ్యాయి. బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/17238) రైళ్లు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు, 5 నుంచి 9 వరకు, 12 నుంచి 16 వరకు, 19 నుంచి 23 వరకు రద్దు చేశారు.


ఈనెల 29 నుంచి విజయవాడ- విశాఖ మధ్య రాకపోకలు సాగించే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించారు. ధన్‌బాద్‌-అలెప్పీల మధ్య నడిచే బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351) రైలు ఈనెల 29నుంచి ఫిబ్రవరి 25 వరకూ నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదు గా విజయవాడ చేరుతుంది. హతియా- బెంగుళూరుల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ (12835)‌ రైలు ఈనె ల 30న, ఫిబ్రవరి 4,6,11,13,18,20,25 తేదీల్లో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజ యవాడ చేరుతుంది. హతియా-బెంగు ళూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ (18637) రైలు ఫిబ్రవరి 3,10,17,24 తేదీల్లో నిడదవోలు, భీమవరం, గుడివా డ మీదుగా విజయవాడకు చేరుతుంది.


హటియా-ఎర్నాకుళం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ (22837) రైలు ఈనెల 29, ఫిబ్రవరి 5,12,19 తేదీల్లో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు చేరుతుంది. టాటా-యశ్వంత్‌పూర్‌ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ (18111) రైలు ఫిబ్రవరి 1,8,15,22 తేదీల్లో నిడద వోలు, భీమవరం, గుడివాడల మీదు గా విజయవాడకు చేరుతుంది. భావన గర్‌-కాకినాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ (12756) రైలు ఫిబ్రవరి 3,10,12,19 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమ వరంటౌన్‌ మీదుగా నిడదవోలు వెళుతుంది.


బెంగుళూరు-గౌహతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ (12509) రైలు ఈనెల 31, ఫిబ్రవరి 2,7,9,14,16,21,23 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌ల మీదుగా నిడదవోలు చేరుతుంది. ముంబై-భువనేశ్వర్‌ల మధ్య నడిచే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019) ఈనెల 29,31, ఫిబ్రవరి 2,3,5,7,9,10,12, 14,16,17,19,21,23,24 తేదీల్లో విజయవాడ, గుడి వాడ, భీమవరం టౌన్‌ మీదుగా నిడదవోలు వెళుతుంది. వివరాలకు సమీపంలోని రైల్వేస్టేషన్‌ బుకింగ్‌ కార్యాలయ సిబ్బంది ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.


ఈ నెల 29– ఫిబ్రవరి 25 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్‌–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్‌ (07861) రైళ్లు రామవరప్పాడు నుంచి బయలుదేరి, తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్టేషన్‌ వరకే నడవనున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa