ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరించడానికి సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం అరకు నియోజకవర్గ వైకాపా సీనియర్ నేత మాజీ సర్పంచ్ చిన్నారావు ఆధ్వర్యంలో హుకుంపేట మండలంలోని కోట్నాపల్లిలో నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన భీమిలిలో జరుగు బహిరంగసభకు నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని దిశా నిర్దేశం చేశారు.