అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
న్యూ హాంప్‌షైర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమెకు ట్రంప్ మద్దతుదారుడి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ట్రంప్ మద్దతుదారుడు బిగ్గరగా అరిచాడు. దాంతో హేలీ తనకు ఓటు వేస్తావా? అని అడిగింది. ఆ వ్యక్తి ట్రంప్‌కు ఓటు వేస్తానని చెప్పాడు.