జాతీయ రహదారిపై ముందు వెళుతున్న టిప్పర్‌ను వెనుకవైపు వస్తున్న కారు డ్రైవర్ ని ద్రమత్తులో బలంగా ఢీకొట్డాడు. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇరువురు మహిళలకు, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సింగరాయకొండలోని కందుకూరు ఫ్లైఓవర్ మీద జరిగింది. చీమకుర్తి నుంచి రామాయపట్నం పోర్టుకు గ్రానైట్లోడుతో టిప్పర్ వెళుతుండగా, తిరుపతికి చెందిన వారు నల్గొండ ఆసుపత్రిలో వారి బంధువులను పరామర్శించి తిరుగు ప్రయాణంలో వస్తున్నారు. కందుకూరు ఫ్లైఓవర్ వద్ద ముందు వెళుతున్న టిప్పర్‌ను కారు డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న శేషావతి, వెంకటమ్మ, డ్రైవర్ మాధవలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు బీ శశిధర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్‌లింగం, కానిస్టేబుల్ షరీఫ్ క్షతగాత్రులను 108, హైవే అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శేషావతి మృతి చెందింది. ఎస్సై శ్రీరామ్ కేసు దర్యాప్తు చేస్తున్నన్నారు.