జగన్ పాలనలో 74మంది బీసీలు వైసీపీ వారి చేతుల్లో దారుణ హత్యలకు గురయ్యారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం సంజామల వనంవెంకటేశ్వరస్వామి ఆలయంలో బీసీ జయహో కార్యక్రమం బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్యక్షతన నిర్వహించా రు. రాష్ట్ర టీడీపీ బీసీ కులాల నాయకులు వై.నాగేశ్వరరావుయాదవ్, డాక్టర్ మల్లికార్జున, వలసల రామకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటైన బహిరంగ సభకు బీసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ మాట్లాడుతూ బీసీల ఆశాజ్యోతి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు అని బీసీల అభివృద్ది టీడీపీతోనే సాధ్యమైందన్నారు. బీసీలంటూ సీఎం జగన్ బీసీల వన్ను విరుస్తున్నారంటూ విమర్శించారు. నాయకులు తులసిరెడ్డి, కోడూరు పెద్దపుల్లయ్య, మహేశ్‌యాదవ్, మల్కిహుసేని, తోకల మద్దిలేటి, ఆల్వ కొండ బాషా, పస్పల మహమ్మద్, గిద్దలూరు మౌలాలి, సానెం రవి, మాధవ భూషన్న, టీడీపీ మండల ఇంచార్జి బత్తుల ప్రతాప్‌రెడ్డి, కాట్రెడ్డి మల్లిఖార్జునరెడ్డి, మూసాని చంద్రశేఖర్‌రెడ్డి, మాయలూరు పెద్దసుబ్బారెడ్డి, విష్ణుశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.