మహిళా సాధికారతకు పెద్ద పీట వేశామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉందని ఉద్ఘాటించారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్త బుట్టలో పడేశాడని గుర్తు చేశారు. అక్టోబర్ 2016 నుంచి ఆ అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేశాడు. అప్పట్లో.. పొదుపు సంఘాల రుణాలు కాస్త.. తడిసి మొపెడు అయ్యి వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు కూడా కిందకు పడిపోయాయన్నారు. ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.