వైసీపీ ప్రభుత్వ స్వలాభం కోసం కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది. మన రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ లేరు. అలాం టి మన రాష్ట్రంపై బీజేపీ పెత్తనం ఏంటి?’’ అని పీసీసీ అద్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. జిల్లాల పర్యటన చేపట్టిన ఆమె.. మంగళవారం విజయగనరం పట్టణంలో విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజన నేపథ్యంలో చట్ట ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. పదేళ్లు చాలదు 15 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు కూడా హోదాను తీసుకురాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చి న జగనన్న ఏకంగా బీజేపీకి తొత్తుగా మారిపోయారు. రాష్ట్రానికి రాజధాని లేదు. పోలవరం లేదు. దివంగత నేత వైఎస్ చేపట్టిన జలయజ్ఞం పనులు తప్ప గత పదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులు లేవు’’ అని అన్నారు. ‘‘నిరుద్యోగ సమస్య రాష్ట్రాన్ని వెంటాడుతోంది. ప్రత్యేకహోదా ఉంటే రాయతీలు అమలై పరిశ్రమలు వచ్చేవి. కానీ హోదాలేదు. పరిశ్రమలు స్థాపించే ప్ర యత్నం చేయలేదు. ఎన్నికలు మరో రెండు నెలలు ఉ న్న సమయంలో జగనన్నకు జాబ్ క్యాలండర్ గుర్తుకు వచ్చిందా? గ్రూప్-1 ఉద్యోగాలు చేసే అర్హత మన రాష్ట్ర నిరుద్యోగ యువతకు లేదా?’’ అని షర్మిల ప్రశ్నించారు.