బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న సంఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు రావడంతో మనస్థాపం చెందిన భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి108 వాహనం ద్వారా హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.