ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం చెవిటికల్లు, కునికినపాడు గ్రామాలకు సంబంధించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పట్ల బాధ్యతతో, నిబద్ధతతో ప్రతి గడపకు వెళ్ళాం, జగనన్న ప్రభుత్వం ద్వారా ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాలు నుండి అందిన లబ్ధిని వివరించాం అన్నారు.