పామాయిల్ సాగు విస్తరణ కు కేంద్ర ప్రభుత్వ అనుచిత వైఖరి అడ్డంకిగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నేడు ఆయన దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పామాయిల్ రైతులు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ధరలు తగ్గి రైతులకు నష్టం కలుగుతోందన్నారు. ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ ఓఈఆర్ ఫార్ములా ప్రకారం రైతులకు ధరలు చెల్లించాలని తుమ్మల పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక మూడు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఏపీ పామాయిల్ రైతులు తనను కలిశారన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నా పామాయిల్ రైతుల కోసం పోరాడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల కొత్త రైతులు పామాయిల్ సాగుకు ముందుకు రావడం లేదన్నారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్రకారం రైతులకు ధరలు చెల్లించాలని తుమ్మల పేర్కొన్నారు.