గుంతకల్లు పట్టణంలోని వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో దృష్టి పెట్టాలని ప్రతిపక్ష టిడిపి కౌన్సిలర్లు కృపాకర్ తదితరులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్ పర్సన్ భవాని అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. తన వార్డులో రోడ్లు, మురుగు కాలువలు ఏర్పాటుకు టెండర్లు పిలిచి మూడేళ్లు అయినా పనులు చేయలేదని అన్నారు. కమిషనర్ మల్లికార్జున పాల్గొన్నారు.