రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.