‘‘కాంగ్రెస్కు ఏపీలో ఓటు అడిగే అర్హత లేదు. బాగున్న రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్. రెండు సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ పేరును ఆయన చనిపోయాక ఎఫ్ఆఐర్లో పెట్టి అవమానించిన పార్టీ కాంగ్రెస్. వైయస్సార్ లేని సమయం చూసి ఆయన కుటుంబాన్ని రోడ్డుకీడ్చింది కాంగ్రెస్. ఆ పార్టీలోకి వచ్చి ఎవరు విమర్శలు చేసినా జీరోలే అవుతారు. సామాన్య కార్యకర్తను కూడా తన కుటుంబ సభ్యుడిగా చూసే వ్యక్తి సీఎం వైయస్ జగన్. ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 సమాధానం చెబుతుంది’’ అని మంత్రి రోజా పేర్కొన్నారు.