రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం 30.65 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది.
ఈ స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో రిజిస్ట్రేషన్ తర్వాత ఆ స్థలాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం కలిగింది.