కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "దేశంలోనే హిందూ శబ్దంతో పేరున్న నియోజకవర్గం హిందూపురం మాత్రమే.
ఇక్కడి నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచి పార్లమెంటుకు వెళ్లి, ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని ఢిల్లీలో చెప్పాలని ఉంది. ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా. వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నా." అని వ్యాఖ్యానించారు.