నంద్యాల: శ్రీశైలం దేవస్థానంలో మల్లన్న సేవాటిక్కెట్ల తారుమారు వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఆన్లైన్ ద్వారా గోపూజ టికెట్‌ను బుక్ చేసుకుని వచ్చాడు.
అయితే ఆలయంలోకి వెళ్లే సమయంలో టికెట్ స్కాన్ కాకపోవడంతో భక్తుడు అయోమయానికి గురయ్యాడు. ఏడాది క్రితం టికెట్‌గా చూపించడంతో విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకుపోగా పొరపాటున పాత టికెట్టు తీసుకొచ్చాడని దాటవేశారు.