ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉంది. వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రయోగం కావడం గమనార్హం. అణ్వాస్త్ర సామర్థ్యం కలిగిన క్షిపణిని గతవారం ప్రయోగించగా ఆదివారం ఉదయం మరో మిస్సైల్‌ను దక్షిణ కొరియా దిశగా సముద్రంలోకి ప్రయోగించింది. దీనిపై సియోల్ నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ సమీపంలో చేస్తున్న సైనిక విన్యాసాలను ఆపాలని ప్యాంగ్యాంగ్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.