బీహార్ తరహాలోనే భవిష్యత్తులో ఇతర (బీజేపీయేతర) రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి వస్తుందని ఛత్తీస్గఢ్ మంత్రి, బీజేపీ నేత బ్రిజ్మోహన్ అగర్వాల్ ఆదివారం పేర్కొన్నారు. 'బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సామాన్యులు, పేదలు, కార్మికులు, యువకులు, మహిళల అభివృద్ధే ధ్యేయంగా సాగుతున్నందున దేశం మొత్తం ఒక గొడుగు కిందకు వస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ బీజేపీ, మోదీతో కలిసి మెలిసి ఉండాలని అన్నారు.బీహార్లో రాజకీయ పరిణామాలపై ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్పందిస్తూ, నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తున్న విధానం, అది (ఎన్డిఎకు మారడం) ఊహించినదేనని అన్నారు.