మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, డబ్ల్యూసీఎల్ ప్రాంతాల్లో ఆర్థికంగా లాభసాటిగా లేని బొగ్గు గనులు నాణ్యత లేని బొగ్గును ఉత్పత్తి చేస్తాయని, మైనింగ్ దాదాపుగా ఆగిపోయిన చోట బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు వినియోగించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం తెలిపారు.బొగ్గు సెక్రటరీ అమృతలాల్ మీనా, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్, కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) చైర్మన్ పీఎం ప్రసాద్ తదితరులు హాజరైన నాగ్‌పూర్ నగరంలో అడ్వాంటేజ్ విదర్భ కార్యక్రమంలో 'బొగ్గు గ్యాసిఫికేషన్'పై జరిగిన సెషన్‌లో ఆయన ప్రసంగించారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు, బొగ్గు వెలికితీత మరియు బొగ్గు పిట్‌హెడ్‌లపై విద్యుత్ ప్రాజెక్టులలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి కేంద్ర మంత్రి మద్దతు ఇచ్చారు. అమ్మోనియం నైట్రేట్ కొరత మైనింగ్ పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తోందని పేర్కొన్న గడ్కరీ, అమ్మోనియం నైట్రేట్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. బొగ్గు నుంచి యూరియాను వెలికి తీయకుండా కేంద్రం ప్రవేశపెట్టిన నానో యూరియానే వినియోగించాలన్నారు. దేశ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ఇంధనం, జీవ ఇంధనం అవసరమని గడ్కరీ పునరుద్ఘాటించారు.