గ్రామీణ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడా కారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తోందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తెలిపారు. 45 రోజులు పాటు పండగ వాతావరణంలో పోటీలు ఐదు క్రీడా అంశాల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో "ఆడుదాం ఆంధ్రా"ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి క్రీడల పోటీలలో రణస్థలం మండలం నుంచి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, ప్రైజ్ మనీలను ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతులు మీదుగా అందజేశారు. వాలీబాల్ లో పురుషులు కొవ్వాడ జట్టు ప్రథమ స్థానం, కబాడీ లో పురుషులు చిల్లపేటరాజాం జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్ లో పురుషులు జే.ఆర్.పురం2 జట్టు ద్వితీయ స్థానం, ఖోఖోలో పాతర్లపల్లి పురుషులు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. బ్యాడ్మింటన్ లో జే.ఆర్. పురం2 మహిళలు జట్టు తృతీయ స్థానం సంపాదించింది. కబడ్డీలో కృష్ణాపురం మహిళలు జట్టు తృతీయ స్థానం సంపాదించింది. క్రికెట్ లో కొవ్వాడ పురుషులు జట్టు తృతీయ స్థానం సంపాదించింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి,రణస్థలం మండలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జడ్పీటీసీ టొంపల సీతారాం,మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు, వైస్ ఎంపీపీ రాయపురెడ్డి బుజ్జి, వైస్ ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు, రణస్థలం మండలం స్పెషల్ ఆఫీసర్ దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.