పులివెందుల నియోజకవర్గంలోని కార్యకర్తలను ఇన్నాళ్లూ పట్టించుకోని వైసీపీ ఇప్పుడు వాళ్లు దూరమవుతారనే భయంతో డబ్బులు పంచుతున్నారని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు వైసీపీ నాయకులు తనకు ఫోన్ చేసి చెబుతున్నారని తెలిపారు. పులివెందులలో టీడీపీ గెలుస్తుందనడానికి వైసీపీ చేస్తున్న అభద్రతభావమే నిదర్శనమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం జగన్ ఎంత నీచానికైనా దిగజారుతారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa