ఢిల్లీలో దట్టమైన కాలుష్యానికి తోడు పొగమంచు అలుముకుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొగమంచు ప్రభావంతో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్-3 టెక్నాలజీ లేని విమానాలపై పొగమంచు ప్రభావం పడుతోంది. ఢిల్లీ వాయు నాణ్యత 328 పీ.ఎం.తో వెరీ పూర్ కేటగిరికి చేరింది. కాలుష్యం, పొగమంచుతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.